పవన్-కంగన కాంబో?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటూ ఆశ్చర్యం కలిగించిన సంగతి తెలిసిందే.;

By :  S D R
Update: 2025-07-30 01:04 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటూ ఆశ్చర్యం కలిగించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విడుదలైన తొలి సినిమా కావడంతో ప్రచారంలో ఎక్కువగా పాల్గొన్నాడు పవన్. ఈనేపథ్యంలో ఓ యూట్యూబ్ ఇంటర్యూలో బాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరోయిన్ కంగన అని తెలిపాడు పవర్ స్టార్.

ఆమెను ‘స్ట్రాంగర్ యాక్ట్రెస్’గా అభివర్ణిస్తూ.. 'ఎమర్జెన్సీ' చిత్రంలో ఇందిరాగాంధీగా ఆమె నటనపై ప్రశంసలు కురిపించాడు. ఈ వ్యాఖ్యలపై కంగన రనౌత్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, నమస్తే, లవ్ ఎమోజీలతో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇద్దరూ రాజకీయంగా కూడా ఒకే బాటలో సాగుతున్నారు. పవన్ జనసేన పార్టీ బీజేపీ మిత్రపక్షంగా ఉండగా, కంగన బీజేపీ ఎంపీగా వ్యవహరిస్తుంది. హిందూ ధర్మం పట్ల వీరి అభిమానం కూడా ఈ కాంబోకు ప్రత్యేకతనిచ్చే అంశం.

ఇప్పటికే కంగన తెలుగులో ప్రభాస్ సరసన 'ఏక్ నిరంజన్' చిత్రంలో నటించిన అనుభవం ఉంది. పవన్ ఇప్పటివరకు ఆమెతో కలిసి నటించలేదు. మరి.. మునుముందు వీరిద్దరి కాంబోలో సినిమా సెట్ అవుతుందేమో చూడాలి.

Tags:    

Similar News