‘ఉస్తాద్..‘ క్లైమాక్స్ అదరహో!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లేటెస్ట్ గా క్లైమాక్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.;

By :  S D R
Update: 2025-07-29 10:02 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లేటెస్ట్ గా క్లైమాక్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

నబకాంత మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన క్లైమాక్స్ ఎపిసోడ్ యాక్షన్ తో పాటు.. ఎమోషనల్ గానూ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ తెలిపింది. ఇక త్వరలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్‘లో పవన్ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవ్వనున్నట్టు తెలుస్తోంది.

‘గబ్బర్ సింగ్‘ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే ‘ఉస్తాద్..‘ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనుందట టీమ్.



Tags:    

Similar News