'కింగ్డమ్' ప్రీ రిలీజ్ హైలైట్స్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.;

By :  S D R
Update: 2025-07-29 00:22 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

లేటెస్ట్ గా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, 'ప్రేక్షకులు గౌరవించే సినిమాలే చేస్తా. కింగ్డమ్ విషయంలో ఓ మంచి సినిమా చేశామన్న తృప్తి ఉంది. ఇది నాకు కాదు, మాకు చెందిన సినిమా. గౌతమ్‌, అనిరుధ్‌, నాగవంశీ, నవీన్ నూలి లాంటి వాళ్లతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అభిమానుల కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నా. 'కింగ్డమ్'తో ఖచ్చితంగా హిట్ వస్తుంది' అని విశ్వాసం వ్యక్తం చేశాడు.

సినిమాలో కీలక పాత్రలు పోషించిన సత్యదేవ్, వెంకటేష్, అలాగే అనేక సాంకేతిక నిపుణులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి బాణీలు అందించగా, ఈవెంట్‌లోనే ‘రగిలే’ పాటను లైవ్‌లో పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతేకాదు, తెలుగులో మాట్లాడుతూ, 'మీరు నా వాళ్లు అయ్యారు. మీరు నన్ను మీ వాడిని చేసుకున్నారు. ఎప్పటికీ మీ అనిరుధ్ నే' అని చెప్పి అభిమానులను ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై, యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్లింది. శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌లో అన్నదమ్ముల కథగా ఈ చిత్రం రూపొందింది. విజయ్ దేవరకొండ – సత్యదేవ్ అన్నదమ్ములుగా, వీరి మధ్య జరిగే భావోద్వేగాలకు తోడు యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కథ నడవనుంది. ట్రైలర్‌లో కనిపించిన మరో కీలక పాత్రగా విలన్‌ వేషంలో నటుడు వెంకటేష్ వీపీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మలయాళ టీవీ, సినిమాల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ కి ఇది తొలి తెలుగు సినిమా.

Tags:    

Similar News