'అవతార్ 3' ట్రైలర్ వచ్చేసింది!

అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలంతో.. పండోరా అనే సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం 'అవతార్'.;

By :  S D R
Update: 2025-07-28 16:06 GMT

అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలంతో.. పండోరా అనే సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం 'అవతార్'. 2009లో విడుదలైన ఈ సినిమా ఏకంగా 2.7 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి.. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. సూపర్ హిట్ ‘అవతార్‘కి ఒకేసారి నాలుగు సీక్వెల్స్ ప్రకటించాడు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్.

‘అవతార్‘ ఫస్ట్ సీక్వెల్ ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్' 2022 డిసెంబర్ లో రిలీజయ్యింది. గత రెండు అవతార్ చిత్రాలు కలిపి దాదాపు 5 బిలియన్ డాలర్లు వసూలు చేశాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో థర్డ్ పార్ట్ రెడీ అయ్యింది. ఈ సిరీస్‌లో మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమా ద్వారా పండోరాలోని మరో కొత్త తెగ అష్ పీపుల్ ను పరిచయం చేయబోతున్నాడు జేమ్స్. వీరు బూడిద రంగులో కనిపిస్తూ, అగ్నికుండల చుట్టూ నర్తించే రూపంలో కనిపిస్తున్నారు. వీరి నాయకురాలిగా వెరాంగ్ అనే పాత్రలో ఊనా చాప్లిన్ నటించింది. ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్ లో జేక్ సల్లీ, నెయ్తిరి ఫ్యామిలీ ఈ కొత్త శత్రువులతో ఎలా పోరాడింది అనేది చూపించబోతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 19న 'అవతార్ 3' రిలీజవుతుంది.


Full View


Tags:    

Similar News