మనోజ్ ఎమోషనల్ స్పీచ్

నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిరాయ్‌’ భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో తేజ సజ్జా, మంచు మనోజ్‌ కీలక పాత్రల్లో కనిపించారు. రిలీజ్‌ అయిన మొదటి రోజే ఈ చిత్రం రూ.27 కోట్లు వసూలు చేసి మంచి హైప్‌ క్రియేట్‌ చేసింది.;

By :  S D R
Update: 2025-09-13 09:30 GMT

నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిరాయ్‌’ భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో తేజ సజ్జా, మంచు మనోజ్‌ కీలక పాత్రల్లో కనిపించారు. రిలీజ్‌ అయిన మొదటి రోజే ఈ చిత్రం రూ.27 కోట్లు వసూలు చేసి మంచి హైప్‌ క్రియేట్‌ చేసింది. ఈరోజు ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది టీమ్. ఈ మీట్ లో మనోజ్‌ ఎమోషనల్‌ స్పీచ్‌ అందరినీ కదిలించింది.

మనోజ్‌ మాట్లాడుతూ '12 ఏళ్ల తర్వాత సక్సెస్‌ని చూడటం కలలాంటిది. ఈ కథలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కార్తిక్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంతకాలం బయట అందరితో ధైర్యంగా మాట్లాడినా, లోపల భయం ఉండేది. చాలా సినిమాలు చివరి నిమిషంలో క్యాన్సిల్‌ అయ్యాయి. అలాంటి సమయంలో నన్ను నమ్మిన కార్తిక్‌, విశ్వప్రసాద్‌ నిజమైన దేవుళ్లు' అని వాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు.

మనోజ్‌ తన పిల్లల గురించి మాట్లాడుతూ మరింత భావోద్వేగానికి గురయ్యాడు. 'నా పిల్లలను నేను సరిగ్గా పెంచగలనా అన్న భయం ఉండేది. కానీ ఈ విజయంతో ఆ భయాన్ని పోగొట్టారు. నన్ను మాత్రమే కాదు, నా కుటుంబాన్నీ మీరు నిలబెట్టారు. ప్రతి ఇంట్లో నుంచి నా కోసం ప్రార్థించిన అందరికీ హృదయపూర్వక పాదాభివందనం' అన్నాడు. ఇకపై వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరించేందుకు రెడీ అవుతానని హామీ ఇచ్చాడు.

సినిమా సక్సెస్‌ తర్వాత మనోజ్‌ తన కుటుంబంతో ఆనందం పంచుకున్నాడు. ముఖ్యంగా, తన తల్లికి పాదాభివందనం చేస్తూ తీసుకున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 'మిరాయ్‌ విజయం మా అమ్మకు అందరికంటే ఎక్కువ ఆనందం ఇచ్చింది. నా చుట్టూ ఉన్న ప్రియమైన వారితో ఈ ఆనందాన్ని పంచుకోవడం చిరస్మరణీయం. నా అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు' అని ఎమోషనల్‌ పోస్ట్ చేశాడు.

ఇటీవలి కాలంలో మంచు ఫ్యామిలీలో కొన్ని వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా మనోజ్‌ తన భార్య, పిల్లలతో వేరుగా ఉంటున్నాడు. అయితే, ‘మిరాయ్‌’ విజయానంతరం తల్లితో తిరిగి కలిసిన మనోజ్‌ వీడియో చూసి నెటిజన్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే విష్ణు కూడా 'మిరాయ్' గురించి ట్వీట్ చేయడం.. దానికి మనోజ్ స్పందించడం జరిగింది. 'ఇదే ఆరంభం.. మళ్లీ కుటుంబం అంతా కలవాలి' అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.



Tags:    

Similar News