'ఓజీ' కోసం మెగాస్టార్?
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్‌కే కాదు, మొత్తం సినీప్రేమికులకూ ఒక ఫెస్టివల్ వంటిది. ప్రస్తుతం అందరి దృష్టి 'ఓజీ' పైనే ఉంది. ఇప్పటివరకు ఎన్నో మాస్ రోల్స్‌లో మెప్పించిన పవన్ కళ్యాణ్, ఈ సారి పూర్తిగా ఓ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించబోతున్నాడు.;
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్‌కే కాదు, మొత్తం సినీప్రేమికులకూ ఒక ఫెస్టివల్ వంటిది. ప్రస్తుతం అందరి దృష్టి 'ఓజీ' పైనే ఉంది. ఇప్పటివరకు ఎన్నో మాస్ రోల్స్‌లో మెప్పించిన పవన్ కళ్యాణ్, ఈ సారి పూర్తిగా ఓ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పవన్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందనే హైప్ ఉంది. ఓజాస్ గంభీరగా పవర్ స్టార్ సిల్వర్ స్క్రీన్‌పై చేసే సందడి కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే అమెరికాలో ప్రీ సేల్స్ లో అదరగొడుతున్న 'ఓజీ' ప్రమోషనల్ స్ట్రాటజీపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 18న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. సెప్టెంబర్ 20న విజయవాడలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరుకాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకే వేదికపై అన్నదమ్ములు కనిపిస్తే మెగాభిమానుల ఆనందానికి అవధులుండవు.
అంతేకాకుండా సినిమా రిలీజ్‌కు ముందురోజు (సెప్టెంబర్ 24) రాత్రి 9 గంటల సమయంలో ఏపీలో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. సుజీత్ దర్శకత్వంలో, డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కాబోతుంది. 'హరిహర వీరమల్లు'తో మిశ్రమ స్పందన అందుకున్న పవన్, ఇప్పుడు 'ఓజీ'తో పక్కా కంబ్యాక్ ఇస్తాడని అందరూ నమ్ముతున్నారు.