‘కిష్కింధపురి’కి పెరుగుతున్న ఆదరణ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రానికి మొదటి రోజు మోస్తరు కలెక్షన్లే వచ్చినా, రెండో రోజునుంచి పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తోంది.;
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రానికి మొదటి రోజు మోస్తరు కలెక్షన్లే వచ్చినా, రెండో రోజునుంచి పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తోంది.
మొదటి రోజు రూ.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లతోనే ఆరంభమైన ఈ సినిమాకు సగటు ఆక్యుపెన్సీ 37% మాత్రమే నమోదైంది. ఉదయం, మధ్యాహ్నం షోలు తగ్గినప్పటికీ, రాత్రి షోలు మాత్రం 57% పైగా నిండాయి. ఈరోజు శనివారం ఆక్యూపెన్సీ బాగుందని తెలుస్తోంది. రేపు ఆదివారం కూడా 'కిష్కింధపురి' బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలీ (అనుపమ) దెయ్యాల గైడ్స్‌గా పనిచేస్తూ ఔత్సాహికులను భయపెట్టడం వారి వృత్తి. కానీ మూతపడిన సువర్ణమాయ రేడియో స్టేషన్‌లోకి వెళ్లినప్పుడు మాత్రం నిజమైన దెయ్యం ఎదురవుతుంది. అక్కడి నుంచి బయటపడ్డ వాళ్లు ఒక్కొక్కరుగా చనిపోతుండటమే కాకుండా, రేడియోలోని వాయిస్ వారిని వేటాడుతుంది. ఆ దెయ్యం ఎవరు? దాని వెనకున్న రహస్యం ఏమిటి? అన్నదే అసలు కథ.
థ్రిల్లింగ్ సన్నివేశాలు, భయపెట్టే వాయిస్ ఎఫెక్ట్స్, సరికొత్త హారర్ యాంగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్‌లో బుకింగ్స్ ఊపందుకోవడం, యూత్ మరియు ఫ్యామిలీస్ ఆసక్తి చూపించడం పాజిటివ్ బజ్‌ను పెంచుతోంది.