బుకింగ్స్ లో 'కింగ్డమ్' దూకుడు

విజయ్ దేవరకొండ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ బుకింగ్స్ పరంగా భారీ హైప్ సెట్ చేస్తోంది.;

By :  S D R
Update: 2025-07-30 00:27 GMT

విజయ్ దేవరకొండ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ బుకింగ్స్ పరంగా భారీ హైప్ సెట్ చేస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన 'కింగ్డమ్' సినిమాకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఒక్క బుక్ మై షోలోనే గత 24 గంటల్లో లక్ష టికెట్లకు పైగా సేల్ కావడం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో చాటిచెబుతోంది.

ఇప్పటికే 'కింగ్డమ్' ప్రీ-సేల్స్ ద్వారా రూ.2 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అమెరికాలో ఈరోజు ప్రీమియర్ కోసం 20,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ సినిమాకి అక్కడ 336 లొకేషన్లలో ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ.52 కోట్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.54 కోట్లు షేర్, అంటే రూ.108 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News