సితార సంస్థలో రిషబ్ శెట్టి
టాలీవుడ్‌లో మరో ఆసక్తికర హిస్టారికల్ పీరియడ్ డ్రామా తెరకెక్కనుంది. ‘కాంతార’తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో నటిస్తున్న చిత్రమిది.;
టాలీవుడ్‌లో మరో ఆసక్తికర హిస్టారికల్ పీరియడ్ డ్రామా తెరకెక్కనుంది. ‘కాంతార’తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో నటిస్తున్న చిత్రమిది. ‘ఆకాశవాణి’ సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకుడు.
ఇప్పటికే అధికారికంగా చిత్రాన్ని ప్రకటించిన మేకర్స్.. ‘అన్ని తిరుగుబాటులకు యుద్ధరంగమే ఆధారం కాదు. కొన్ని విధి చేత ఎంపిక చేయబడతాయి. ఇది ఒక తిరుగుబాటుదారుని కథ‘ అంటూ ఈ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫిల్మ్ టైటిల్ ఇంకా ఖరారు కాకపోయినా, ‘The Land Burned, A Rebel Rose‘ అన్న క్యాప్షన్‌తో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.
18వ శతాబ్ధంలో బెంగాల్‌లో జరిగిన ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక రిషబ్ శెట్టి ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ లో ‘హనుమాన్‘ సీక్వెల్ ‘జై హనుమాన్‘లో నటిస్తున్నాడు. మరోవైపు రిషబ్ మోస్ట్ అవైటింగ్ ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇంకా.. ఛత్రపతి శివాజీ బయోపిక్ లోనూ అలరించనున్నాడు రిషబ్ శెట్టి.