కోలీవుడ్ లో భారీ ఆఫర్ అందుకుంది !
ఇప్పుడు రుక్మిణి రెండు బిగ్ టికెట్ మూవీస్ సెట్ చేసుకుంది. ఒకటి ఎన్టీఆర్‌తో తెలుగులో కాగా.. మరొకటి విక్రమ్‌తో ఒక భారీ తమిళ ప్రాజెక్ట్. విక్రమ్ 64వ సినిమాగా.. '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌ను ఐసరి గణేష్ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.;
కన్నడ మూవీ 'సప్త సాగరాలు దాటి'తో స్పాట్‌లైట్‌లోకి వచ్చిన టాలెంటెడ్ యాక్ట్రెస్ రుక్మిణి వసంత్. ఇప్పుడు కోలీవుడ్‌లో కూల్ ఆఫర్స్‌తో ఎంట్రీ ఇస్తోంది. 2019లో 'బిర్బల్ ట్రయాలజీ' తో సినిమా జర్నీ స్టార్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత హిందీ ఫిల్మ్ 'అప్‌స్టార్ట్స్' లో కనిపించింది. కానీ, 'సప్త సాగరాలు దాటి' తోనే ఆమెకు రియల్ బ్రేక్ వచ్చింది. అవార్డులు సొంతం చేసుకుని, కెరీర్‌లో ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్లింది. దాని సీక్వెల్‌లోనూ నటించింది రుక్మిణి.
శివరాజ్‌కుమార్‌తో 'భైరతి రణంగల్'లో కీలక రోల్ ప్లే చేసింది. అక్కడి నుంచి తెలుగు సినిమాకు మళ్ళి.. నిఖిల్ సిద్ధార్థ్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీలో నటించింది. తమిళ ఇండస్ట్రీ ఆమె టాలెంట్‌ను గమనించి, ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో శివకార్తికేయన్‌తో 'మదరాసి'లో ఛాన్స్ కొట్టేసింది. 'మదరాసి' షూటింగ్ జరుగుతుండగా, విజయ్ సేతుపతితో 'ఏస్' లో నటించింది, అది రిలీజై మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇప్పుడు రుక్మిణి రెండు బిగ్ టికెట్ మూవీస్ సెట్ చేసుకుంది. ఒకటి ఎన్టీఆర్‌తో తెలుగులో కాగా.. మరొకటి విక్రమ్‌తో ఒక భారీ తమిళ ప్రాజెక్ట్. విక్రమ్ 64వ సినిమాగా.. '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌ను ఐసరి గణేష్ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాస్ట్, క్రూ ఫైనలైజ్ అవుతున్నాయి. షూటింగ్ త్వరలో కిక్‌స్టార్ట్ కానుంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్స్‌తో రుక్మిణి సౌత్ ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్‌గా మారుతోంది.