హీరో పాత్రకోసం లోకేశ్ కనగరాజ్ కసరత్తులు
ఒక ఇంటర్వ్యూలో లోకేష్ తన రోల్ కోసం ఇప్పటికే సన్నద్ధమవుతున్నట్టు చెప్పాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. బరువు తగ్గి, మసిల్స్ బిల్డ్ చేస్తున్నాడు. అలాగే, క్యారెక్టర్‌కు సరిపోయేలా గడ్డం పెంచాడు.;
లోకేష్ కనగరాజ్.. సౌత్ ఇండస్ట్రీస్ లో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడు. ఇప్పుడు హీరోగా అడుగుపెట్టబోతున్నాడు. ‘ఖైదీ, మాస్టర్, విక్రమ్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో తన గ్రిప్పింగ్ కథనం, ఇంటెన్స్ సినిమాటిక్ స్టైల్‌తో భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. అతడి గత చిత్రం ‘లియో’ అంచనాలను అందుకోలేకపోయినా.. లోకేష్ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు.
ఇప్పుడు ఆయన నటనా రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఫ్యాన్స్ ఈ క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కెప్టెన్ మిల్లర్, సాని కాయిదం’ చిత్రాల ఫేమ్ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ రాబోయే గ్యాంగ్‌స్టర్ సినిమాలో లోకేష్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా లోకేష్‌ను ఇంటెన్స్, యాక్షన్‌తో కూడిన రోల్‌లో చూపించనుంది, ఇది ఆయన దర్శకత్వ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
ఒక ఇంటర్వ్యూలో లోకేష్ తన రోల్ కోసం ఇప్పటికే సన్నద్ధమవుతున్నట్టు చెప్పాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. బరువు తగ్గి, మసిల్స్ బిల్డ్ చేస్తున్నాడు. అలాగే, క్యారెక్టర్‌కు సరిపోయేలా గడ్డం పెంచాడు. ‘ఖైదీ-2’ స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అని.. దర్శకుడిగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ముందుగా నటన ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు లోకేష్ తెలిపాడు. గతంలో శృతి హాసన్‌తో ‘ఇనిమేల్’ అనే మ్యూజిక్ వీడియోలో నటించిన లోకేష్.. తన స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో నటనపై మరింత నమ్మకం పెంచుకున్నాడు.