అనిరుధ్ ‘పవర్ హౌస్’ సాంగ్ పై కాపీ మరక
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న రాబోయే బిగ్ బడ్జెట్ మూవీ “కూలీ”లోని “పవర్ హౌస్” అనే సాంగ్.. కాపీ కొట్టారనే ఆరోపణలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.;
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ కంపోజర్‌లలో అనిరుద్ రవిచందర్ ఒకడు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తరచూ కలిసి పనిచేసే ఈ యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. తన లేటెస్ట్ ట్రాక్‌తో భారీ వివాదంలో చిక్కుకున్నాడు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న రాబోయే బిగ్ బడ్జెట్ మూవీ “కూలీ”లోని “పవర్ హౌస్” అనే సాంగ్.. కాపీ కొట్టారనే ఆరోపణలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియా యూజర్లు.. ప్రత్యేకించి ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో, ఈ పాటకు అమెరికన్ రాపర్ లిల్ నాస్ ఎక్స్ 2021లో విడుదల చేసిన సూపర్ హిట్ సాంగ్ “ఇండస్ట్రీ బేబీ”తో సారూప్యతలను గుర్తించారు. బీట్‌లోని రిథమ్, ఓవరాల్ ట్యూన్, రాప్ స్ట్రక్చర్‌లో ఉన్న స్ట్రైకింగ్ సిమిలారిటీని నెటిజన్లు గమనించి, ఈ రెండు పాటల మధ్య సైడ్-బై-సైడ్ కంపారిజన్ వీడియోలు, క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ పోలికలు చూసిన కొందరు ఫ్యాన్స్ మరియు క్రిటిక్స్, అనిరుద్ “ఇండస్ట్రీ బేబీ”ని డైరెక్ట్‌గా కాపీ చేశాడని, ప్లగేరిజం ఆరోపణలు చేస్తూ ఆన్‌లైన్‌లో గట్టిగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న “కూలీ” సినిమా, భారీ అంచనాల మధ్య 2025 ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. అయితే, ఈ కాపీ ఆరోపణలపై అనిరుద్ లేదా “కూలీ” టీమ్ నుండి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ రాలేదు. సోషల్ మీడియాలో ఈ ఇష్యూ గురించి డిబేట్ మాత్రం ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది.
అనిరుద్, గతంలో “జైలర్”, “పేట” వంటి రజనీకాంత్ సినిమాలకు బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వివాదం అతని రిప్యూటేషన్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, “కూలీ” సినిమా హైప్‌ని ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది.