రజనీ- కమల్ కాంబో కన్ఫర్మ్స్

లేటెస్ట్ గా కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్ నిజంగానే లోడింగ్ అని.. ధృవీకరించారు. ఇటీవల జరిగిన ఒక అవార్డు వేడుకలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు.;

By :  K R K
Update: 2025-09-08 00:48 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్.. నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒక మల్టీస్టారర్ లో నటిస్తారనే.. ఊహాగానాల తర్వాత.. లేటెస్ట్ గా కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్ నిజంగానే లోడింగ్ అని.. ధృవీకరించారు. ఇటీవల జరిగిన ఒక అవార్డు వేడుకలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు.

"ఇది సినీ వర్గాల్లో చాలామందిని ఆశ్చర్యపరచవచ్చు. కానీ రజనీకాంత్ నా స్నేహితుడు. ఈ కాంబో చాలా కాలంగా ఆలస్యమవుతూ వస్తోంది. నిజానికి మేము కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే మాకు ఒకే బిస్కెట్‌ను పంచుకోవాల్సి వచ్చింది. అప్పుడు మేము ప్రేక్షకులు మాకు ఒక్కొక్కరికి ఒక బిస్కెట్ ఇవ్వాలని కోరాము. ఇప్పుడు మళ్లీ ఒక బిస్కెట్‌ను పంచుకోవడానికి వచ్చాము. ఇది చూసిన తర్వాత ప్రేక్షకులే దీన్ని గొప్ప కాంబో అని నిర్ణయించాలి.. అని అన్నారు.

ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని పుకార్లు వచ్చినప్పటికీ, ఇది ఇంకా ఫైనల్ కాలేదు . వీరిద్దరూ చివరిసారిగా 1979లో ఐవీ శశి దర్శకత్వంలో వచ్చిన ‘అలావుద్దీనుం అత్భుత విలక్కుం’ (తెలుగులో ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’ గా డబ్ అయింది) చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ అలావుద్దీన్‌గా హీరోగా, రజనీకాంత్ కమరుద్దీన్‌గా విలన్‌గా నటించారు. జయభారతి, శ్రీప్రియ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు.

కమల్ హాసన్ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ మూవీలో కనిపించారు. ప్రస్తుతం అన్బరివ్‌తో కేహెచ్237, ఇండియన్ 3 చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. రజనీకాంత్ ఇటీవల ‘కూలీ’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చిత్రీకరణలో ఉన్నారు. లోకేష్ కనగరాజ్ కూడా ఆమీర్ ఖాన్‌తో ఒక సూపర్ హీరో చిత్రం, ‘ఖైదీ 2’ ప్రాజెక్టుల్లో ఉన్నారు.

Tags:    

Similar News