పెళ్ళైన 9 నెలలకు కీర్తి కొత్త ప్రాజెక్ట్
కీర్తి 2024 డిసెంబర్‌లో ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఇది ఆమె మొదటి సినిమా. ప్రముఖ తమిళ దర్శకుడు- నటుడు మిస్కిన్‌తో కలిసి ఒక తమిళ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది కీర్తి సురేశ్ .;
మహానటి కీర్తి సురేష్, తన పెళ్ళి జరిగిన తొమ్మిది నెలల తర్వాత కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది. ఆఫర్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ.. ఎట్టకేలకు తన కృషి ఫలించడంతో ఓ కొత్త సినిమాను తాజాగా అధికారికంగా ప్రారంభించింది. కీర్తి 2024 డిసెంబర్‌లో ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఇది ఆమె మొదటి సినిమా.
ప్రముఖ తమిళ దర్శకుడు- నటుడు మిస్కిన్‌తో కలిసి ఒక తమిళ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది కీర్తి సురేశ్ . ఈ సినిమా మహిళా కేంద్రితంగా ఉంటుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్న జీ స్టూడియోస్ సోషల్ మీడియాలో ప్రకటించింది.. “మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్, ప్రొడక్షన్ నెం. 9, మిస్కిన్ డైరెక్షన్ లో కీర్తి సురేశ్ నటిస్తున్న చిత్రం, ఈ రోజు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది...”
ఇదిలా ఉండగా, కీర్తి తెలుగు ప్రాజెక్టుల కోసం ఇంకా చర్చలు జరుపుతోందని సమాచారం. ఆమె తిరిగి టాలీవుడ్‌లోకి రావాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.