‘వార్ 2‘ నుంచి రొమాంటిక్ సాంగ్
వచ్చే ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద ‘వార్ 2, కూలీ‘ చిత్రాల మధ్య క్లాష్ ఓ రేంజులో ఉండబోతుంది. ఇప్పటినుంచే ఈ రెండు సినిమాలూ ప్రచారంలో దూకుడు చూపిస్తున్నాయి.;
వచ్చే ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద ‘వార్ 2, కూలీ‘ చిత్రాల మధ్య క్లాష్ ఓ రేంజులో ఉండబోతుంది. ఇప్పటినుంచే ఈ రెండు సినిమాలూ ప్రచారంలో దూకుడు చూపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్-హృతిక్ కాంబోలో రూపొందుతున్న ‘వార్ 2‘ నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది.
హృతిక్ రోషన్, కియారా అద్వానీ లపై రొమాంటిక్ గా చిత్రీకరించిన ఈ గీతం జూలై 31న రిలీజవుతోంది. ఆ పాటకు సంబంధించిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్. హృతిక్ రోషన్ కబీర్ పాత్రలోనూ కియారా కావ్య రోల్ లోనూ గూఢచారులుగా కనిపించబోతున్నారు. వీరిద్దరి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ పాట ఉంటుందట. ప్రీతమ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను రోమ్, టస్కానీ వంటి ప్రదేశాలలో చిత్రీకరించారు.
మరోవైపు ఈ సినిమాలో హృతిక్-తారక్ మధ్య చిత్రీకరించిన సూపర్బ్ డ్యాన్స్ నంబర్ పైనా భారీ అంచనాలున్నాయి. ఇండియాలోని టాప్ డ్యాన్సర్స్ అయిన హృతిక్, తారక్ కలిసి సందడి చేయబోయే ఈ పాట కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.