కొత్త రిలీజ్ డేట్ తో జాన్వీ ‘పరమ్ సుందరి’

ఈ రొమాంటిక్ కామెడీ మొదట జులై 25, 2025న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. ‘సైయారా’ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ మూవీ రిలీజ్‌ను వాయిదా వేశారు.;

By :  K R K
Update: 2025-07-30 08:07 GMT

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్‌ సరసన హీరోయిన్ గా ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. అదే సమయంలో, ఆమె తదుపరి హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’ విడుదలకు సిద్ధమవుతోంది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ మొదట జులై 25, 2025న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. ‘సైయారా’ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ మూవీ రిలీజ్‌ను వాయిదా వేశారు.

తాజాగా, చిత్ర బృందం ‘పరమ్ సుందరి’ చిత్రానికి కొత్త విడుదల తేదీని ప్రకటించింది. పరమ్ సుందరి ఆగస్టు 29, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రకటనతో పాటు, సోను నిగమ్, కృష్ణకలి సాహా ఆలపించిన మొదటి పాట ‘పరదేశియా’ ను కూడా విడుదల చేశారు. ఈ ఆత్మీయమైన గీతానికి సచిన్-జిగర్ సంగీతం సమకూర్చారు.

ఈ చిత్రంలో జాన్వీ సరసన సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన సాంస్కృతిక నేపథ్యంలో రూపొందిన పరమ్ సుందరి కథ.. ఉత్తర భారతీయుడైన పరమ్, దక్షిణ భారతీయురాలైన సుందరి మధ్య జరిగే తమాషా... హార్ట్ టచింగ్ రొమాన్స్‌ చుట్టూ తిరుగుతుంది.

Tags:    

Similar News