‘టేకెన్’ హీరోపై డేటింగ్ రూమర్స్ !

రెడ్ కార్పెట్‌లో ఆడంబరమైన క్షణాలు, ఫ్లర్టీ ఇంటర్వ్యూలు, పమెలా లియామ్ కోసం కుకీలు, సౌర్‌డౌ బ్రెడ్ తయారు చేయడం వంటివి అభిమానుల్లో ఏదో జరుగుతోందనే అనుమానాలను పెంచాయి.;

By :  K R K
Update: 2025-07-30 07:40 GMT

‘టేకెన్, ఏ టీమ్, రన్ ఆల్ నైట్, ది కమ్యూటర్ లాంటి క్రేజీ సినిమాలతో ప్రపంచ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు హాలీవుడ్ వెటరన్ స్టార్ లియామ్ నీసన్. ఈ స్టార్ .. పమెలా ఆండర్సన్ తో కలిసి ప్రస్తుతం ‘ది నేకెడ్ గన్’ సినిమా ప్రమోషన్‌స్ లో ఉన్నారు. హాలీవుడ్ మీడియా ఇన్ఫో ప్రకారం.. వీరిద్దరూ తెరపై కెమిస్ట్రీతో పాటు, వ్యక్తిగతంగా కూడా దగ్గరగా కనిపించడంతో చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. రెడ్ కార్పెట్‌లో ఆడంబరమైన క్షణాలు, ఫ్లర్టీ ఇంటర్వ్యూలు, పమెలా లియామ్ కోసం కుకీలు, సౌర్‌డౌ బ్రెడ్ తయారు చేయడం వంటివి అభిమానుల్లో ఏదో జరుగుతోందనే అనుమానాలను పెంచాయి.

ఈ ఊహాగానాలు గత రాత్రి న్యూయార్క్ సిటీలో జరిగిన సినిమా ప్రీమియర్‌లో వీరిద్దరూ తమ పిల్లలతో కలిసి కనిపించడంతో మరింత ఊపందు కున్నాయి.లియామ్ తన దివంగత భార్య నటాషా రిచర్డ్‌సన్‌ కు పుట్టిన కొడుకులు మైఖల్, డేనియల్ ని తీసుకొచ్చాడు. పమెలా తన మాజీ భర్త టామీ వల్ల పుట్టిన కొడుకులు బ్రాండన్, డైలాన్ తో కలిసి వచ్చింది. ఈ ఆరుగురూ ‘ది నేకెడ్ గన్’ పోస్టర్ల ముందు నవ్వుతూ.. మాట్లాడుకుంటూ ఫోటోలకు పోజులిచ్చారు. దాంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

ఒక మీడియా ఇంటర్వ్యూలో లియామ్ అండ్ పమెలా కెమెరాల ముందు ముద్దు పెట్టుకున్నట్లు సరదాగా నటించారు. మరుసటి రోజు ఉదయం ఒక షోలో వీరు మరింత సరదాగా కనిపించారు. “మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? మీరు జంటగా ఉన్నారా?” అని హోస్ట్ ప్రశ్నించగా.. వీరిద్దరూ ప్రశ్నను సరిగ్గా విననట్లు సరదాగా సమాధానం ఇచ్చారు. అనంతరం లియామ్ కాస్త ఆలోచనాత్మకంగా, కొంచెం గూఢంగా సమాధానమిచ్చాడు. “నేను పమెలాను ఇంతకు ముందు ఎప్పుడూ కలవలేదు. సెట్‌లో కలిసాము. మా మధ్య ఒక అద్భుతమైన, పరిణామం చెందుతున్న కెమిస్ట్రీ ఉందని గుర్తించాము. నటులుగా. ‘ఇది బాగుంది, దీన్ని ఒక టైప్‌లో బంధించకుండా సహజంగా సాగనిద్దాం’ అని అనుకున్నాము. అలాగే చేశాము...” అని అన్నాడు.

Tags:    

Similar News