రొమాంటిక్ సాంగ్ తో వచ్చిన ప్రదీప్
బుల్లితెరపై వ్యాఖ్యాతగా అదరగొట్టిన ప్రదీప్ వెండితెరపైనా హీరోగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. కథానాయకుడిగా తొలి చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'తో సక్సెస్ సాధించాడు. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో వస్తున్నాడు.;
బుల్లితెరపై వ్యాఖ్యాతగా అదరగొట్టిన ప్రదీప్ వెండితెరపైనా హీరోగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. కథానాయకుడిగా తొలి చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'తో సక్సెస్ సాధించాడు. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ టైటిల్ తో వస్తోన్న సినిమా ఇది. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి‘ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ పై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ప్రియమారా…’ అంటూ సాగే పాట విడుదలైంది. రధన్ అందించిన ఈ మెలోడీ ట్యూన్‌కు రాకేందు మౌళి కవిత్వం బాగుంది. శరత్ సంతోష్, లిప్సికా మెలోడియస్ గా ఈ పాటను ఆలపించారు. బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ప్రదీప్, దీపిక మధ్య రొమాంటిక్ గా ఈ సాంగ్ ను పిక్చరైజ్ చేశారు.