ప్రభాస్ ను కలిసిన పూరి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.;

By :  S D R
Update: 2025-07-30 00:52 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇక ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. ఇందులోని వీఎఫ్ఎక్స్‌, ప్రభాస్ లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రస్తుతం 'ది రాజా సాబ్' ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. లేటెస్ట్ గా ఈ మూవీ సెట్స్‌కు దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మీ కౌర్ హాజరై ప్రభాస్‌తో ఆత్మీయంగా ముచ్చటించారు. పూరిని ప్రభాస్ హత్తుకుని పలకరించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూరి – ప్రభాస్ కాంబినేషన్‌లో ‘బుజ్జిగాడు’ (2008), ‘ఏక్ నిరంజన్’ (2009) చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ప్రభాస్ కి కమర్షియల్ గా సరికొత్త కోణంలో ఆవిష్కరించాయి. అలాగే ఛార్మీ కూడా ‘చక్రం, పౌర్ణమి’ చిత్రాల్లో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్-ఛార్మీ నిర్మాతలుగా విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు. పూరి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఓ విభిన్నమైన కథతో తెరకెక్కుతుందట.

Tags:    

Similar News