తెలుగు చిత్ర సీమలో విషాదం.. నిర్మాత కన్నుమూత!

తెలుగు చిత్రసీమలో నిర్మాతగా తనదైన ముద్ర వేసిన వేదరాజు టింబర్ (54) ఈరోజు ఉదయం కన్నుమూశారు.;

By :  S D R
Update: 2025-01-31 07:01 GMT

తెలుగు చిత్రసీమలో నిర్మాతగా తనదైన ముద్ర వేసిన వేదరాజు టింబర్ (54) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఎ.ఐ.జి (AIG) హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆశించినప్పటికీ, ఈ దురదృష్టకర ఘటన వారందరినీ శోకసంద్రంలో ముంచేసింది.


వేదరాజు టింబర్ నిర్మాతగా అభిరుచి గల చిత్రాలను అందించారు. ముఖ్యంగా అల్లరి నరేష్ తో రూపొందించిన ‘మడత కాజా’, ‘సంఘర్షణ’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఒకవైపు కన్స్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉంటూనే, మరోవైపు సినీ నిర్మాణం మీద ఆసక్తిని కనబర్చారు వేదరాజు.


ఇటీవలే ఆయన మరో కొత్త సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉండగా, ఆయన అకాల మరణం సంభవించింది. వేదరాజు టింబర్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News