తమిళ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అదరగొడుతోంది !

శశికుమార్, సిమ్రాన్ జోడీగా నటించిన ఈ సినిమా వెరైటీ కథాకథనాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.;

By :  K R K
Update: 2025-05-07 07:07 GMT

స్టార్స్ ఎవరూ లేరు. ఫేమస్ డైరెక్టర్ కాదు. పెద్దగా పాపులర్ ఫేస్‌లు లేవు. గ్రాండ్‌ కాస్టింగ్ లేదు. స్క్రీన్‌పై కనబడే వారంతా కలిపితే ముప్పై నలభై మంది. అయినా… చిన్న తమిళ సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఇప్పుడు బాక్సాఫీసు వద్ద పెద్ద సినిమాలను సైతం పక్కకి నెట్టి.. బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. శశికుమార్, సిమ్రాన్ జోడీగా నటించిన ఈ సినిమా వెరైటీ కథాకథనాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

గత వారం విడుదలైన ఈ తక్కువ బడ్జెట్ తమిళ సినిమా.. సుర్యా నటించిన ‘రెట్రో’, తెలుగు హిట్ సిరీస్‌లో భాగమైన ‘హిట్ 3’ వంటి భారీ సినిమాల మధ్యలో రిలీజ్ అయి వాటికన్నా ఎక్కువగా కలెక్షన్లు సాధిస్తోంది. బుక్ మై షో వేదికగా, ఒక్కరోజు ఈ సినిమాకు 66,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో హిట్ 3కి 59,000, రెట్రోకి 35,000 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గమనించాల్సింది ఏమిటంటే, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ విడుదల అయినది కేవలం తమిళంలో మాత్రమే.

ఇప్పుడు కొంతమంది నిర్మాతలు తమ సినిమాల కలెక్షన్లకు క్రికెట్, వేసవి వేడి, నెగటివ్ రివ్యూలను కారణంగా చెబుతున్న ఈ సమయంలో.. మంచి కథ, బాగా తీసిన సినిమా ఎంత చిన్నదైనా తన ప్రేక్షకులను తానే వెతికిపెడుతుందని ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మరోసారి రుజువు చేసింది.

ఈ సినిమాపై తెలుగు పరిశ్రమలో ఇప్పుడు హాట్ బజ్ నడుస్తోంది. డబ్బింగ్ రైట్స్ గానీ, రీమేక్ హక్కుల గానీ తీసుకోవడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ఓ వర్గం నిర్మాతలు మాత్రం ఈ సినిమాలోని అసలు ఎమోషన్ ముఖ్యంగా శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో కథ నడవడం .. మరో భాషలో రీప్రొడ్యూస్ చేయడం అంత సులువు కాదు.. అని భావిస్తూ.. డబ్బింగ్ వర్షన్‌కి మొగ్గు చూపుతున్నారు. సో.. సమయం, బడ్జెట్, స్టార్ వేల్యూ అవసరం లేకుండానే ఓ సినిమా ఎలా విజయం సాధించాలో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఒక అందమైన ఉదాహరణగా నిలుస్తోంది.

Tags:    

Similar News