‘పార్కింగ్’ డైరెక్టర్ తో చియాన్ విక్రమ్?

ఇండస్ట్రీలో జోరుగా చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, రామ్‌కుమార్ తదుపరి చిత్రంలో చియాన్ విక్రమ్ నటించే అవకాశం ఉంది.;

By :  K R K
Update: 2025-08-13 01:16 GMT

నేషనల్ అవార్డ్ గెలుచుకున్న డైరెక్టర్ రామ్‌కుమార్.. తన తొలి చిత్రం ‘పార్కింగ్’ తో సంచలనం సృష్టించి, తన రెండో చిత్రం ఈ ఏడాది ప్రారంభమవుతుందని అధి కారికంగా ప్రకటించాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. “నా రెండో సినిమా ఈ సంవత్సరంలోనే షూటింగ్ మొదలవుతుంది. చివరి చర్చలు జరుగుతున్నాయి. నెల రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుంది,” అని తెలిపాడు

మొదట రామ్‌కుమార్ శింబు 49వ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సి ఉండగా, ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది, కానీ రద్దు కాలేదు. స్క్రిప్ట్ పని పూర్తయ్యాక వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే, శింబు ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఇండస్ట్రీలో జోరుగా చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, రామ్‌కుమార్ తదుపరి చిత్రంలో చియాన్ విక్రమ్ నటించే అవకాశం ఉంది.

ఇది చియాన్ 65గా రూపొందే సూచనలు కనిపిస్తున్నాయి. విక్రమ్ ఇప్పటికే చియాన్ 63 (శాంతి టాకీస్), చియాన్ 64 (ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్) చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. మరి తమిళ సినిమా ప్రేమికులు ఈ భారీ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News