అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరహో
రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ విడుదలకు నాలుగు రోజులు ముందే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ₹50 కోట్లకు పైగా వసూలు చేసింది.;
రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ విడుదలకు నాలుగు రోజులు ముందే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ₹50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించగా, ఆమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. 2 గంటల 48 నిమిషాల నిడివితో ఈ చిత్రం ఇప్పటికే 'ఏ' సర్టిఫికెట్ పొందింది.
మరోవైపు అదే రోజు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ‘వార్ 2’ కూడా రిలీజ్ అవుతోంది. నార్త్ ఇండియాలో 90% సింగిల్ స్క్రీన్స్‌ను ‘వార్ 2’ ఆక్రమిస్తుండగా, దక్షిణాదిలో ‘కూలీ’ ప్రభంజనం కొనసాగబోతుంది. రెండు సినిమాలు ఓవర్సీస్‌లోనూ భారీగా విడుదల కానున్నాయి. ‘కూలీ’ క్రేజ్ నేపథ్యంలో చెన్నై, బెంగళూరు సహా పలు నగరాల్లోని యూనో ఆక్వాకేర్ సంస్థ ఉద్యోగులకు మూవీ రిలీజ్ రోజు సెలవు ప్రకటించగా, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.