నారా రోహిత్ 'సుందరకాండ' ట్రైలర్

నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' ఈ వినాయకచవితి కానుకగా ఆగస్టు 27న విడుదలకు ముస్తాబవుతుంది. వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కించిన ఈ చిత్రం 'నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ది సేమ్' అనే ట్యాగ్ లైన్ తో రాబోతుంది.;

By :  S D R
Update: 2025-08-11 13:37 GMT

నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' ఈ వినాయకచవితి కానుకగా ఆగస్టు 27న విడుదలకు ముస్తాబవుతుంది. వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కించిన ఈ చిత్రం 'నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ది సేమ్' అనే ట్యాగ్ లైన్ తో రాబోతుంది. శ్రీదేవి విజయ్ కుమార్, విర్తీ వఘాని హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీలో పెళ్లికాని ప్రసాద్ టైప్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు నారా రోహిత్. తనకు నచ్చిన ఐదు క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెతికే అబ్బాయిగా నారా రోహిత్ పాత్ర కనిపిస్తుంది. సీనియర్ నరేష్, వాసుకి ఆనంద్, అభినవ్ గోమటం ఇతర కీలక పాత్రలు పోషించారు. మొత్తంగా.. ఆగస్టు 27న రవితేజ 'మాస్ జాతర'తో క్లాష్ కి రెడీ అవుతుంది రోహిత్ 'సుందరకాండ'.


Full View


Tags:    

Similar News