‘వార్ 2‘లో మరో స్టార్?
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్ 2’ చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్.;
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్ 2’ చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. ఈ మూవీలో మరో స్టార్ హీరో కూడా కనిపించబోతున్నాడట. ‘యానిమల్‘ విలన్ బాబీ డియోల్ ‘వార్ 2‘లో కేమియోలో మురిపించబోతున్నట్టు బీటౌన్ టాక్.
యష్ రాజ్ ఫిల్మ్స్ ఫ్రాంఛైజ్ లో బాబీ డియోల్ ని భాగం చేయాలనే ‘వార్ 2‘లో అతని ఎంట్రీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ఈ చిత్రంపై భారీ బజ్ ఉంది. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ వంశీ తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ మూవీలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, వీరిద్దరి డ్యాన్స్ నంబర్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా ‘వార్ 2‘ రిలీజ్ కు రెడీ అవుతుంది.