రైల్వే పోలీస్ గా రవితేజ
'మాస్ జాతర.. మనదే ఇదంతా' అంటూ టీజర్ లో వింటేజ్ రవితేజాను ఆవిష్కరించాడు డైరెక్టర్ భాను భోగవరపు. ఈ సినిమాలో రైల్వే పోలీస్ గా కనిపించబోతున్నాడు రవితేజ.;
మాస్ మహారాజ రవితేజకు హిట్టొచ్చి చాన్నాళ్లయ్యింది. ‘ధమాకా, వాల్తేరు వీరయ్య‘ తర్వాత చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఈనేపథ్యంలో ఇప్పుడు తన ఆశలన్నీ ‘మాస్ జాతర‘పైనే పెట్టుకున్నాడు మాస్ రాజా. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ‘ఓలే ఓలే‘ సాంగ్ కు మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా టీజర్ రిలీజయ్యింది.
'మాస్ జాతర.. మనదే ఇదంతా' అంటూ టీజర్ లో వింటేజ్ రవితేజాను ఆవిష్కరించాడు డైరెక్టర్ భాను భోగవరపు. ఈ సినిమాలో రైల్వే పోలీస్ గా కనిపించబోతున్నాడు రవితేజ. టీజర్ ఆద్యంతం అభిమానుల అంచనాలను పెంచుతూ రవితేజ వింటేజ్ మాస్ లుక్‌ను హైలైట్ చేస్తుంది. మొత్తంగా మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ ఆయన నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్టు ఈ మాస్ ర్యాంపేజ్ టీజర్ చూస్తే అర్థమవుతుంది.
'ధమాకా' తర్వాత రవితేజ, శ్రీలీల నటిస్తున్న సినిమా ఇది. నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 27న ‘మాస్ జాతర‘ థియేటర్లలోకి రానుంది.