ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ క్లారిటీ
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి అభిమానుల ఉత్సుకత ఎప్పటిలాగే కొనసాగుతోంది.;
By : S D R
Update: 2025-08-11 13:27 GMT
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి అభిమానుల ఉత్సుకత ఎప్పటిలాగే కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన పెద్దమ్మ, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన ఆమె, ప్రభాస్ పెళ్లి కోసం ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 'బయట అమ్మాయా, సినిమా అమ్మాయా అన్నది తెలియదు కానీ ప్రభాస్ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఏడాది కానీ, లేదంటే వచ్చే ఏడాది కానీ పెళ్లి అవుతుంది. శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే జరుగుతుంది' అని స్పష్టం చేశారు. శ్యామలాదేవి చెప్పిన మాటలతో ప్రభాస్ అభిమానులు పెళ్లి శుభవార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.