వావ్... వాటే కాంబో !

తాజా సమాచారం ప్రకారం.. రజనీకాంత్ నటుడు, దర్శకుడు శశికుమార్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.;

By :  K R K
Update: 2025-08-13 00:25 GMT

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ సినిమాతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు. ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆగస్టు 14న ‘కూలీ’ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రజనీకాంత్, నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే, రజనీకాంత్ కొత్త సినిమాల కోసం చాలా మంది దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. రజనీకాంత్ నటుడు, దర్శకుడు శశికుమార్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. శశికుమార్ లేటెస్ట్ గా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత శశికుమార్‌కి నటన ఆఫర్లు క్యూ కట్టాయి. అయినా, శశికుమార్ దర్శకత్వంపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

రజనీకాంత్‌ని దృష్టిలో పెట్టుకుని ఓ స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఇటీవలే రజనీకి నరేట్ చేశాడు. రజనీకాంత్ ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శశికుమార్ పూర్తి స్క్రిప్ట్‌ని రెడీ చేసి, త్వరలో రజనీకి మళ్లీ నరేట్ చేయనున్నాడు. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News