‘ఆపరేషన్ సిందూర్‘కి టాలీవుడ్ సపోర్ట్
భారత దేశాన్ని కలచి వేసిన పహాల్గమ్ ఉగ్రవాద దాడి దేశ ప్రజల్లో తీవ్రమైన ఆవేదనను కలిగించింది. ఈ హత్యాకాండ దేశాన్ని ఒక్కటిగా మార్చింది.;
భారత దేశాన్ని కలచి వేసిన పహాల్గమ్ ఉగ్రవాద దాడి దేశ ప్రజల్లో తీవ్రమైన ఆవేదనను కలిగించింది. ఈ హత్యాకాండ దేశాన్ని ఒక్కటిగా మార్చింది. పాక్ ప్రేరిత ఉగ్రవాదానికి సరైన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజాభిప్రాయం ఘాటుగా వ్యక్తమైంది.
ఇలాంటి సంక్షోభ సమయంలో భారత ఆర్మీ ఊహించని విధంగా ‘ఆపరేషన్ సిందూర్’ అనే మెరుపు దాడికి శ్రీకారం చుట్టింది. తెల్లవారు జామున 1:44కి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై జరిగిన ఈ ఆకస్మిక దాడితో దేశవ్యాప్తంగా జాతీయ భావోద్వేగాలు ఉప్పొంగాయి. ఇది కేవలం ఆర్మీ ప్రతాపం మాత్రమే కాక, దేశ సమైక్యతకు నిదర్శనంగా మారింది.
ఈ ఆపరేషన్ పై సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు మద్దతుగా నిలుస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ఆపరేషన్ సిందూర్ కి మద్దతుగా ట్వీట్స్ చేశారు.