వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా ముహూర్తం
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందే సినిమా ఈరోజు ప్రారంభమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై ప్రొడక్షన్ నంబర్ 8గా సూర్యదేవర చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.;
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందే సినిమా ఈరోజు ప్రారంభమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై ప్రొడక్షన్ నంబర్ 8గా సూర్యదేవర చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు కార్యక్రమానికి హీరో వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ తో పాటు నిర్మాతలు చినబాబు, నాగవంశీ, సురేష్ బాబు హాజరయ్యారు.
గతంలో వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి‘ చిత్రాలకు రచయితగా పనిచేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దర్శకుడిగా వెంకటేష్ తో త్రివిక్రమ్ కు ఇదే తొలి చిత్రం. ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి‘ చిత్రాల తరహాలోనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వెంకీ-త్రివిక్రమ్ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టుకోనుంది. మరోవైపు ‘సంక్రాంతికి వస్తున్నాం‘ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.