'వార్ 2' వసూళ్లెంత?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన 'వార్ 2' నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైంది. గురువారం రాత్రి 8 గంటల వరకు ఈ సినిమా రూ.45.44 కోట్లు నెట్ వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ టాక్.;
By : S D R
Update: 2025-08-15 01:59 GMT
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన 'వార్ 2' నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైంది. గురువారం రాత్రి 8 గంటల వరకు ఈ సినిమా రూ.45.44 కోట్లు నెట్ వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ టాక్. హిందీ వెర్షన్‌కి దేశవ్యాప్తంగా 23.02% సగటు ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 70% పైగా ఆక్యుపెన్సీ రాగా ముంబై, ఢిల్లీలో మాత్రం తక్కువగా ఉంది.
ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ అయిన ఈ చిత్రం యాష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగం. హృతిక్ గత చిత్రం 'ఫైటర్' కంటే మంచి ఓపెనింగ్ సాధించిందని చెబుతున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో హృతిక్ కబీర్ పాత్రలో, ఎన్టీఆర్ విక్రం పాత్రల్లో అలరించగా, కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషించారు. మరికొద్ది సేపట్లో 'వార్ 2' తొలి రోజు వసూళ్లపై క్లారిటీ రానుంది.