'పని 2' అనౌన్స్ అయింది!

‘‘నా తదుపరి చిత్రం. కొత్త కథ. కొత్త ప్రదేశాలు. కొత్త పాత్రలు. 'పనీ 2' త్వరలో రాబోతుంది,’’ అంటూ జోజు పోస్ట్‌కు క్యాప్షన్ జత చేశారు.;

By :  K R K
Update: 2025-05-07 06:52 GMT

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు జోజు జార్జ్ తన తొలి దర్శకత్వ ప్రాజెక్ట్ అయిన ‘పని ’కి సీక్వెల్ రూపొందిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘నా తదుపరి చిత్రం. కొత్త కథ. కొత్త ప్రదేశాలు. కొత్త పాత్రలు. 'పనీ 2' త్వరలో రాబోతుంది,’’ అంటూ జోజు పోస్ట్‌కు క్యాప్షన్ జత చేశారు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది.

‘పనీ’ చిత్రం జోజు జార్జ్‌కి దర్శకుడిగా పరిచయం కల్పించడమే కాకుండా, నటుడిగా అతని కెరీర్‌లోనే అతిపెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచింది. కథనంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, పాత్రల బలం, ముఖ్యంగా జోజు అద్భుత నటన ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి.

ఇప్పుడు ‘పనీ 2’ రూపంలో ఆ కథ కొనసాగనుండటంతో, గిరి పాత్ర ఎటువంటి మలుపులు తిరుగుతుందో, కొత్త పాత్రలు కథలోకి ఎలా ప్రవేశిస్తాయో అన్న ఉత్సుకత అభిమానుల్లో నెలకొంది. డెసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించనున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News