మల్లెపూదండ ఎంత పనిచేసింది?

నవ్య నాయర్ విక్టోరియా మలయాళి అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓణం వేడుకల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఎయిర్‌పోర్టులో అధికారులు ఆమెను అడ్డుకుని, ఆమె బ్యాగ్‌లో మల్లెపూల దండ ఉన్నట్టు గుర్తించారు.;

By :  K R K
Update: 2025-09-08 15:06 GMT

మలయాళ నటి నవ్య నాయర్ మెల్‌బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తన హ్యాండ్‌బ్యాగ్‌లో 15 సెం.మీ. మల్లెపూల దండ తీసుకెళ్లినందుకు ఆమెకు 1,980 ఆస్ట్రేలియా డాలర్స్ (సుమారు ₹1.14 లక్షలు) జరిమానా విధించారు. ఆమెకు ఈ చిన్న విషయం ఇంత భారీ జరిమానాకు దారితీస్తుందని తెలియదు. ఆస్ట్రేలియా కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాల గురించి ఆమెకు అవగాహన లేకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది. దీన్ని ఆమె కూడా అంగీకరించింది.

వివరాల్లోకి వెళితే.. నవ్య నాయర్ విక్టోరియా మలయాళి అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓణం వేడుకల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఎయిర్‌పోర్టులో అధికారులు ఆమెను అడ్డుకుని, ఆమె బ్యాగ్‌లో మల్లెపూల దండ ఉన్నట్టు గుర్తించారు. ఆమె తన తండ్రి ఈ దండను ఆమె ప్రయాణానికి ముందు కొనిచ్చారని అధికారులకు వివరించింది.“నేను చేసింది చట్టవిరుద్ధం. ఇది నాకు తెలియకుండా జరిగిన పొరపాటు. అయినప్పటికీ, అజ్ఞానం సాకు కాదు.

15 సెం.మీ. మల్లెపూల గజ్రా తీసుకెళ్లినందుకు, 28 రోజుల్లో 1,980 ఆస్ట్రేలియా డాలర్స్ జరిమానా చెల్లించాలని అధికారులు కోరారు. ఇది ఉద్దేశపూర్వకం కాకపోయినా, పొరపాటు పొరపాటే,” అని నవ్య చెప్పినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా కస్టమ్స్ చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలను విమానంలో తీసుకెళ్లడానికి అనుమతించరు. సినిమాల విషయానికొస్తే, నవ్య నాయర్ ‘ఇష్టం’ సినిమాతో మాలీవుడ్ లో డెబ్యూ చేసి, ‘మళతుళ్ళిక్కిలుక్కం’, ‘కుంజిక్కూనన్’ వంటి చిత్రాలతో త్వరగా పేరు సంపాదించింది.

Tags:    

Similar News