హ్యాట్రిక్ అందుకొన్న మోహన్ లాల్

‘హృదయపూర్వం’ ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ప్రవేశించింది. దీంతో మోహన్‌లాల్, మలయాళ ఇండస్ట్రీలో వరుసగా మూడు రూ. 50 కోట్ల సినిమాలు అందించిన తొలి నటుడిగా రికార్డు సృష్టించాడు.;

By :  K R K
Update: 2025-09-06 06:03 GMT

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అరుదైన హ్యాట్రిక్ సాధించాడు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ లెజెండ్ నటుడి లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హృదయపూర్వం’ ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ప్రవేశించింది. దీంతో మోహన్‌లాల్, మలయాళ ఇండస్ట్రీలో వరుసగా మూడు రూ. 50 కోట్ల సినిమాలు అందించిన తొలి నటుడిగా రికార్డు సృష్టించాడు.

మోహన్‌లాల్ గత చిత్రాలు ‘ఎల్2: ఎంపురాన్, తుడరుం’ రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించాయి. ప్రస్తుతం లోక: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద బలంగా నడుస్తోంది. అయితే.. ‘హృదయపూర్వం’ పూర్తి రన్‌లో రూ. 100 కోట్ల మైలురాయిని దాటే అవకాశం కొంచెం తక్కువని మలయాళ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ మైలురాయిని దాటితే, ఇది మోహన్‌లాల్‌కు వరుసగా మూడో రూ. 100 కోట్ల గ్రాసర్‌గా నిలుస్తుంది.

ఫీల్-గుడ్ డ్రామాగా రూపొందిన ‘హృదయపూర్వం’ మాస్ అప్పీల్ లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం తక్కువ. ఒణం పండుగ వీకెండ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. చివరికి, ఈ సినిమా బాక్సాఫీస్ విజయం పూర్తిగా మోహన్‌లాల్ స్టార్ పవర్‌పైనే ఆధారపడి ఉంటుంది. ‘హృదయపూర్వం’ చిత్రంలో మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్ కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ మలయాళ దర్శకుడు సత్యన్ అంతిక్కాడ్ ఈ చిత్రాన్ని రూపొందించగా, అంటోనీ పెరుంబావూర్ ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.

Tags:    

Similar News