నివీన్ పాలీ ‘బేబీ గాళ్’ ఫస్ట్ లుక్ వచ్చింది !
ఈ థ్రిల్లర్ సినిమా మోషన్ పోస్టర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా అభిమన్యు తిలకన్, లిజోమోల్ జోస్, ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్‌ల లుక్‌లు కనిపిస్తాయి. చివర్లో నివిన్ పౌలీ కనిపించే పోస్టర్ ఈ పాత్రల చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ డ్రామాను సూచిస్తోంది.;
ఓణం సందర్భంగా.. యంగ్ హీరో నివిన్ పౌలీ నటిస్తున్న ‘బేబీ గాళ్’ సినిమా బృందం మోషన్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ థ్రిల్లర్ సినిమా మోషన్ పోస్టర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా అభిమన్యు తిలకన్, లిజోమోల్ జోస్, ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్‌ల లుక్‌లు కనిపిస్తాయి. చివర్లో నివిన్ పౌలీ కనిపించే పోస్టర్ ఈ పాత్రల చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ డ్రామాను సూచిస్తోంది.
‘గరుడన్’ మలయాళ మూవీ దర్శకుడు అరుణ్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ రచయితలు బాబీ-సంజయ్ ఈ సినిమా స్క్రిప్ట్ రాశారు. అజీస్ నెడుమంగడ్, అశ్వంత్ లాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఫైజ్ సిద్దిక్, ఎడిటర్ షైజిత్ కుమారన్, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ సాంకేతిక బృందంలో ముఖ్య సభ్యులు.
ఈ చిత్రాన్ని లిస్టిన్ స్టీఫెన్ మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ‘బేబీ గర్ల్’ షూటింగ్ జూన్‌లోనే ముగిసింది. అయితే రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.