సందీప్ కిషన్ బర్త్ డే స్పెషల్ వీడియో

తమిళ దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే.;

By :  S D R
Update: 2025-05-07 07:42 GMT

తమిళ దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే.తన తండ్రిలా హీరో కాకుండా సంజయ్ డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తున్నాడు. సంజయ్ తొలి చిత్రంలో కథానాయకుడిగా నటిస్తుంది సందీప్ కిషన్. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

ఈరోజు (మే 7) హీరో సందీప్ కిషన్ బర్త్ డే స్పెషల్ గా ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది టీమ్. సందీప్ కిషన్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ విడుదల చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది.


Full View


Tags:    

Similar News