'కింగ్డమ్' నుంచి 'అన్న అంటేనే'..!

విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' నుంచి బ్రదర్ సెంటిమెంట్ సాంగ్ 'అన్న అంటేనే' వచ్చేసింది. అన్నాదమ్ముల అనుబంధాన్ని చాటి చెప్పేలా సాగే ఈ పాట హృద్యంగా ఆకట్టుకుంటుంది.;

By :  S D R
Update: 2025-07-16 13:55 GMT

విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' నుంచి బ్రదర్ సెంటిమెంట్ సాంగ్ 'అన్న అంటేనే' వచ్చేసింది. అన్నాదమ్ముల అనుబంధాన్ని చాటి చెప్పేలా సాగే ఈ పాట హృద్యంగా ఆకట్టుకుంటుంది. కృష్ణకాంత్ రాసిన 'అన్న అంటేనే.. ఉన్నానంటూనే.. చిన్నోడికోసం.. నిలబడతారే.. కలబడతారే' అంటూ సాగే లిరిక్స్ బాగున్నాయి. ఈ పాటను కంపోజ్ చేస్తూ అనిరుధ్ రవిచందర్ ఆలపించాడు.

ఎమోషనల్ సీన్స్ ను వెండితెరపై అద్భుతంగా పండించడంలో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ప్రత్యేకమైన శైలి. ఈ సినిమాలో అన్నాదమ్ములుగా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ పాత్రలను అలాగే మలిచినట్టు ఈ పాటను చూస్తే అర్థమవుతుంది. 'కింగ్డమ్' మూవీ థీమ్ ను తెలిపే గీతంగా ఈ పాట ఆకట్టుకుంటుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 31న విడుదలకు ముస్తాబవుతుంది.


Full View


Tags:    

Similar News