'మిరాయ్' నుంచి పవర్‌ఫుల్ సాంగ్
ఈవారం థియేటర్లలోకి వస్తోన్న చిత్రాలలో 'మిరాయ్' ఒకటి. 'హనుమాన్'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రమిది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నాడు.;
ఈవారం థియేటర్లలోకి వస్తోన్న చిత్రాలలో 'మిరాయ్' ఒకటి. 'హనుమాన్'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రమిది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నాడు. రితిక నాయక్ హీరోయిన్ గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించాడు.
'హనుమాన్'కి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన గౌర హరి మ్యూజిక్ లో ఇప్పటికే 'మిరాయ్' నుంచి వచ్చిన 'వైబ్ ఉంది' పాట చార్ట్ బస్టర్ అయ్యింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి 'జైత్రయ' అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని లెజెండరీ సింగర్ శంకర్ మహదేవన్ ఆలపించాడు. పవర్‌ఫుల్ లిరిక్స్ తో సాగిన ఈ గీతం థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయంలా కనిపిస్తుంది. సెప్టెంబర్ 12న 'మిరాయ్' థియేటర్లలోకి వస్తోంది.