2 కోట్లతో స్టార్ట్.. 15 కోట్లకు జంప్!

కంటెంట్ కనెక్ట్ అయితే చాలు అది చిన్న సినిమాయా? పెద్ద చిత్రమా అని చూడరు ప్రేక్షకులు. ఆ సినిమాకి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటారు. లేటెస్ట్ గా ‘లిటిల్ హార్ట్స్‘ సినిమాకి అలాంటి అప్లాజ్ వస్తోంది.;

By :  S D R
Update: 2025-09-09 09:37 GMT

కంటెంట్ కనెక్ట్ అయితే చాలు అది చిన్న సినిమాయా? పెద్ద చిత్రమా అని చూడరు ప్రేక్షకులు. ఆ సినిమాకి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటారు. లేటెస్ట్ గా ‘లిటిల్ హార్ట్స్‘ సినిమాకి అలాంటి అప్లాజ్ వస్తోంది. ఇప్పటివరకూ సోషల్ మీడియా స్టార్ గా ఉన్న మౌళి.. ఇప్పుడు ఈ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ స్టార్ గా మారాడు. మౌళి, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

థియేటర్లలో ఒకవైపు ‘ఘాటి, మదరాసి‘ వంటి బడా మూవీస్ ఉన్నా.. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.15.41 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బుక్ మై షోలోనే 3 రోజుల్లో 2.9 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

ప్రేక్షకులతో పాటు హీరో నాని, విజయ్ దేవరకొండ వంటి సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇటీవీ విన్‌ నిర్మాణంలో వచ్చిన తొలి థియేట్రికల్ ప్రాజెక్ట్‌గా ‘లిటిల్ హార్ట్స్’ అంచనాలను మించి నిలిచి, ప్రస్తుతం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. స్టార్ హీరోలు, భారీ యాక్షన్, ఐటెమ్ సాంగ్స్ లేకపోయినా.. కేవలం బలమైన కంటెంట్‌తోనే చిన్న సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించగలదో ‘లిటిల్ హార్ట్స్’ మరోసారి నిరూపించింది.

Tags:    

Similar News