నెల రోజులలో మూడు భారీ చిత్రాలు
టాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థగా పేరు పొందిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, జూలై-ఆగస్టు మధ్య భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.;
టాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థగా పేరు పొందిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, జూలై-ఆగస్టు మధ్య భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సితార సంస్థలో రూపొందిన 'కింగ్డమ్, మాస్ జాతర' చిత్రాలతో పాటు.. 'వార్ 2' తెలుగు హక్కులను సైతం నాగవంశీ దక్కించుకున్నారు. ఈ మూడు సినిమాలు కేవలం నెల రోజుల గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'కింగ్డమ్' జూలై 31న రిలీజవుతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ రూ.50 కోట్లకు అమ్మడైనట్టు తెలుస్తోంది.
మాస్ మహారాజ రవితేజ హీరోగా సితార సంస్థ నిర్మిస్తున్న 'మాస్ జాతర' ఆగస్టు 27న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రవితేజ కెరీర్ లో 75వ సినిమా ఇది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీకి నవీన్ చంద్ర డబ్బింగ్ షురూ చేశాడు. భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను సైతం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. ఈ డీల్ రూ.20 కోట్లకు ఫైనల్ అయినట్లు టాక్.
మరోవైపు.. ఈ రెండు చిత్రాల మధ్యలో సితార నుంచి ఆగస్టు 14నే వస్తోంది 'వార్ 2'. తారక్-హృతిక్ కాంబోలో రూపొందిన ఈ మల్టీస్టారర్ పై తెలుగులోనూ భారీ క్రేజుంది. 'దేవర' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో.. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.