ఆకట్టుకుంటున్న అమ్మ పాట

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి‘. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా.. షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి నిర్మించారు.;

By :  S D R
Update: 2025-09-08 07:38 GMT

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి‘. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా.. షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటివరకూ ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రచార చిత్రాలలో హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపించాయి. అయితే.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి వచ్చిన అమ్మ పాట ఆకట్టుకుంటుంది.

చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ లో పూర్ణాచారి రాసిన ‘నీది నాది ఓ చిరు లోకం‘ అంటూ సాగే ఈ గీతాన్ని ఎస్.పి.చరణ్ ఎమోషనల్ గా ఆలపించాడు. ఈ పాటలో అమ్మ పాత్రలో సీనియర్ నటి ప్రేమ కనిపించింది. ‘కిష్కింధపురి‘ చిత్రానికి ఎమోషనల్ టచ్ ఇస్తూ సాగే ఈ గీతం సినిమా కథను మలుపు తిప్పేదిగా అనిపిస్తుంది. మొత్తంగా.. బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ టైమ్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఏరీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.


Full View


Tags:    

Similar News