యాక్షన్ లో ఇరగదీసిన మనోజ్
ఈ వారం తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మిరాయ్'. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ అనే కీలక పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.;
By : S D R
Update: 2025-09-08 04:30 GMT
ఈ వారం తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మిరాయ్'. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ అనే కీలక పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మైథలాజికల్ సోషియో ఫాంటసీ మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
ముఖ్యంగా ఈ మూవీలో మంచు మనోజ్ పోషించిన బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. మోడర్న్ రావణగా ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో అలరించబోతున్నాడు మనోజ్. ఈ క్యారెక్టర్ కోసం నటన పరంగా, శారీరకంగా మనోజ్ ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని తెలిపేలా ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది 'మిరాయ్' టీమ్. సెప్టెంబర్ 12న 'మిరాయ్' రిలీజ్ కు రెడీ అవుతుంది.