డిఫరెంట్ డ్యాన్స్‌ తో 'ది గర్ల్‌ఫ్రెండ్'

నేషనల్ క్రష్ రష్మిక , 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి 'నదివే' అంటూ సాగే గీతం విడుదలైంది.;

By :  S D R
Update: 2025-07-16 11:15 GMT

నేషనల్ క్రష్ రష్మిక , 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి 'నదివే' అంటూ సాగే గీతం విడుదలైంది.

ప్రేమభావాలను వర్ణించేలా రాకేందు మౌళి అందమైన సాహిత్యాన్నందించిన ఈ పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచి పాడటం విశేషం. ఈ పాటలో రష్మిక, దీక్షిత్‌లపై చిత్రీకరించిన డ్యాన్స్ స్టెప్స్ సాల్సా స్టైల్ లో సరికొత్తగా ఆకట్టుకుంటున్నాయి.

'యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర' లాంటి వరుస విజయాలతో ఉన్న రష్మిక నుంచి రాబోతున్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.


Full View


Tags:    

Similar News