త్వరలో రివీల్ కాబోతున్న టైటిల్ టీజర్
దసరా ఫెస్టివల్ సీజన్‌లో టైటిల్ గ్లింప్స్ అండ్ టీజర్‌ని డ్రాప్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ప్రమోషన్స్ ఇప్పటికే ఫుల్ స్పీడ్‌లో ఉన్నాయి.;
టాలెంటెడ్ హీరో శర్వానంద్.. డెడికేషన్‌కి కేరాఫ్ అడ్రెస్ అయినా.. సినిమా రిలీజ్‌ల విషయంలో డిలేలు ఫేస్ చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది "మనమే" బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాక.. ఈ ఏడాది అతని సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. శర్వానంద్, సంయుక్త జోడీగా నటిస్తున్న "నారినారి నడుమ మురారి" రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ.. అతని మరో క్రేజీ స్పోర్ట్స్ డ్రామా టైటిల్ అండ్ టీజర్‌ని సూపర్ ఫాస్ట్‌గా రివీల్ చేయడానికి టీమ్ రెడీ అవుతోంది.
మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో శర్వానంద్ ఓ హై-ఎనర్జీ స్పోర్ట్స్ డ్రామాలో రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. అభిలాష్ కంకర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. శర్వా బర్త్‌డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అతను స్టైలిష్ మోటర్‌సైకిల్ రేసర్‌గా ఫుల్ స్వాగ్‌తో కనిపించాడు.
ఇప్పుడు టీమ్ దసరా ఫెస్టివల్ సీజన్‌లో టైటిల్ గ్లింప్స్ అండ్ టీజర్‌ని డ్రాప్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ప్రమోషన్స్ ఇప్పటికే ఫుల్ స్పీడ్‌లో ఉన్నాయి. కథ విషయానికొస్తే.. ఈ మూవీ మూడు జనరేషన్స్ ఫ్యామిలీ డ్రీమ్స్, స్ట్రగుల్స్‌ని 90s, 2000s మోటోక్రాస్ రేసింగ్ కల్చర్‌తో మిక్స్ చేసి సూపర్ ఎంగేజింగ్‌గా చూపించబోతోందట. ఈ మూవీకి ‘రేసర్’ అనే క్యాచీ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరి అదే టైటిల్ ఖాయం చేస్తారేమో చూడాలి.