సిద్ధుకి పోటీగా వస్తోన్న ప్రదీప్
పాపులర్ యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ఆడియన్స్ ను మెప్పించింది. ఇప్పుడు తన రెండో చిత్రంగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ని తీసుకొస్తున్నాడు.;
పాపులర్ యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ఆడియన్స్ ను మెప్పించింది. ఇప్పుడు తన రెండో చిత్రంగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ని తీసుకొస్తున్నాడు. నితిన్ – భరత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రదీప్ కి జోడీగా దీపికా పిల్లి నటిస్తోంది. మాంక్స్ & మంకీస్ బ్యానర్‌పై రూమర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. అయితే ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురు కాబోతుంది. ఆ సమయంలోనే సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్‘, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘, సన్నీ డియోల్ ‘జాట్‘ విడుదలకు ముస్తాబవుతున్నాయి.