వైరల్ ఫోటో.. మాస్ & మాస్టర్ ముచ్చట్లు!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ భారీ యాక్షన్ మూవీ ‘వార్ 2‘ షూటింగ్ ముగింపు దశలో ఉండగానే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్‘ ఇటీవలే పట్టాలెక్కింది.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ భారీ యాక్షన్ మూవీ ‘వార్ 2‘ షూటింగ్ ముగింపు దశలో ఉండగానే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్‘ ఇటీవలే పట్టాలెక్కింది.
‘డ్రాగన్‘ మూవీ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. తొలుత తారక్ లేకుండా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాడు ప్రశాంత్ నీల్. లేటెస్ట్ గా ఈ మూవీ సెట్స్ లోకి ఎన్టీఆర్ జాయిన్ కావాల్సి ఉంది. ఈ సందర్భంగా హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తమ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్న ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి ఈ ఫోటోను షేర్ చేశారు. అలాగే ఈ ఫోటోపై ఆమె ‘స్కేరీ, #MadMen‘ అని కామెంట్స్ పెట్టడం ఈ ప్రాజెక్ట్ ఎంత భారీ యాక్షన్-వయోలెన్స్‌తో ఉండబోతుందో సూచిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్-నీల్ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు ముస్తాబవుతుంది.