కొత్త సినిమాతో వస్తోన్న నక్కిన!

కామెడీ ఎంటర్టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన దర్శకుడు త్రినాథరావు నక్కిన. 'మేం వయసుకు వచ్చాం' లాంటి లవ్‌స్టోరీతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నక్కిన.. ఆ తర్వాత 'సినిమా చూపిస్త మావ'తో ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేసుకున్నాడు.;

By :  S D R
Update: 2025-06-17 13:18 GMT

కామెడీ ఎంటర్టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన దర్శకుడు త్రినాథరావు నక్కిన. 'మేం వయసుకు వచ్చాం' లాంటి లవ్‌స్టోరీతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నక్కిన.. ఆ తర్వాత 'సినిమా చూపిస్త మావ'తో ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేసుకున్నాడు. 'నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే' సినిమాలతో మాస్ దర్శకుడిగానూ గుర్తింపు పొందాడు. ఇక రవితేజ 'ధమాకా'తో బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్కును సైతం అందుకున్నాడు.

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్-త్రినాథరావు నక్కిన 'మజాకా' ఫర్వాలేదనించింది. ఈ సినిమా తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా కొత్త చిత్రంతో బిజీ అయిపోయాడు నక్కిన. యంగ్ హీరో హవీష్ తో సినిమాని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. జూన్ 19న ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ రాబోతుంది. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Tags:    

Similar News