రెండు చిత్రాలకూ డబ్బింగ్ రైటర్ ఇతడే!
‘వార్ 2 , కూలీ’ సినిమాలతో ఆయన మరోసారి ఎలాంటి టాలెంట్ చూపిస్తాడో చూడాలి.;
ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో రెండు భారీ సినిమాలు, ‘వార్ 2’, కూలీ‘.. బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టనున్నాయి. ’వార్ 2‘ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ‘కూలీ’ సినిమాను సూపర్‌స్టార్ రజనీకాంత్ మరికొందరు క్రేజీ నటులతో నడిపిస్తున్నారు. మొదట్లో ఈ రెండు సినిమాల మధ్య పెద్దగా క్లాష్ ఉండదని చాలామంది భావించారు. కానీ రెండు టీమ్‌లూ తమ సినిమాలపై గట్టి నమ్మకంతో వెనక్కి తగ్గలేదు.
‘కూలీ’ తమిళంలో తెరకెక్కగా, ‘వార్ 2’ బాలీవుడ్ సినిమా. ఈ రెండు సినిమాల తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లు కూడా అసలు వెర్షన్‌లతో పాటు విడుదలవుతున్నాయి. రెండు సినిమాలకూ తెలుగు డైలాగ్‌లను రాసిన వ్యక్తి రాకేందు మౌళి. ఇతను గతంలో ‘యానిమల్, మహావతార్ నరసింహ, ఖైదీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు తెలుగు డైలాగ్ రైటర్‌గా పనిచేశారు.
రాకేందు మౌళి ఈ సినిమాల్లో అద్భుతమైన పనితనం చూపించారు. ‘వార్ 2 , కూలీ’ సినిమాలతో ఆయన మరోసారి ఎలాంటి టాలెంట్ చూపిస్తాడో చూడాలి. డైలాగ్‌లు రాయడంతో పాటు, రాకేందు మౌళి కొన్ని పాటలకు సాహిత్యం కూడా అందించారు. ఆయన కెరీర్ గమనాన్ని చూస్తే, రాకేందు మౌళి త్వరలోనే మరో స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.