ధనుష్ అండ్ మృణాల్ మధ్య ఏముంది?

ముంబైలో జరిగిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ మూవీ ఈవెంట్‌లో వీళ్లు ఒక్కటై కనిపించారు. అంతేకాదు ఆగస్టు 1న మృణాళ్ బర్త్‌డే బాష్‌లో కూడా ధనుష్ సందడి చేశాడు.;

By :  K R K
Update: 2025-08-06 01:41 GMT

తమిళ స్టార్ ధనుష్, నార్త్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కలిసి కనిపించిన ఒక లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారేమో అని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ముంబైలో జరిగిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ మూవీ ఈవెంట్‌లో వీళ్లు ఒక్కటై కనిపించారు. అంతేకాదు ఆగస్టు 1న మృణాళ్ బర్త్‌డే బాష్‌లో కూడా ధనుష్ సందడి చేశాడు.

వీడియోలో ధనుష్ చెయ్యి మృణాళ్ పట్టుకొని , ఆమె అతని చెవిలో ఏదో సీక్రెట్‌ చెప్తున్న సీన్ కనిపించింది. ఈ క్లోజ్ మూమెంట్ చూసి నెటిజన్స్ వీళ్ల మధ్య ఏదో రొమాంటిక్ వైబ్ ఉందని ఊహించడం మొదలెట్టేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ఇద్దరూ ఇప్పటివరకూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ ముంబై ఫిల్మ్ సర్కిల్‌లో కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని టాక్. ఈ జెస్చర్ కేవలం ఫ్రెండ్లీగానా ఉందా లేక ఇంకేదో స్పెషల్‌గానా ఉందా అనేది క్లారిటీ లేదు.

ధనుష్ గతంలో ఐశ్వర్య రజినీకాంత్‌తో వైవాహిక బంధం లో ఉన్నప్పుడు కూడా కొన్ని అఫైర్ రూమర్స్ ఫేస్ చేశాడు. ఆ రిలేషన్ డివోర్స్‌తో ఎండ్ అయిపోయింది. డివోర్స్ తర్వాత కూడా అతని పేరు ఒక సీనియర్ యాక్ట్రెస్‌తో.. ఒక పాపులర్ తమిళ హీరోయిన్‌తో లింక్ చేయబడింది.

ధనుష్, మృణాళ్‌లను జోడిస్తున్న ఈ లేటెస్ట్ రూమర్స్ ఫ్యాన్స్‌ను షాక్‌లో ముంచెత్తాయి. ఇప్పటివరకూ వీళ్లిద్దరూ ఈ గాసిప్స్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

Tags:    

Similar News