హన్సిక ఇన్ స్టాగ్రామ్ పిక్స్ ఎందుకు తొలగించింది?
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వివాహానికి సంబంధించిన పలు పోస్ట్‌లు ఇటీవల కనిపించకుండా పోయాయి. కొన్ని వెడ్డింగ్ వీడియోలు ఇప్పటికీ ఉన్నప్పటికీ, చాలా ఫొటోలు, ఇంకా ఇతర క్లిప్‌లు సైలెంట్ గా రిమూవ్ అయ్యాయి.;
‘దేశముదురు’ భామ హన్సికా మోత్వానీ తన భర్త సోహైల్ కతురియాతో విడిపోయారనే పుకార్ల మధ్య ఇప్పటికీ మౌనంగా ఉంది. ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తూ.. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వివాహానికి సంబంధించిన పలు పోస్ట్‌లు ఇటీవల కనిపించకుండా పోయాయి. కొన్ని వెడ్డింగ్ వీడియోలు ఇప్పటికీ ఉన్నప్పటికీ, చాలా ఫొటోలు, ఇంకా ఇతర క్లిప్‌లు సైలెంట్ గా రిమూవ్ అయ్యాయి.
దీంతో అభిమానులు, మీడియా వర్గాల్లో మరింత ఊహాగానాలు తలెత్తాయి. చాలా మంది ఈ తొలగించిన పోస్ట్‌లను విడాకుల పుకార్లకు ధృవీకరణగా భావిస్తున్నారు. హన్సికా , సోహైల్ 2022 డిసెంబర్ 4న జైపూర్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం హన్సికా తన తల్లితో కలిసి ఉంటోందని.. విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. గత రెండు వారాలుగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్‌గా లేకపోవడం ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ రహస్యాన్ని మరింత గాఢతరం చేస్తోంది.
33 ఏళ్ల ఈ నటి బాల నటిగా కెరీర్ ప్రారంభించి, 2007లో అల్లు అర్జున్ సరసన తెలుగు సినిమా ‘దేశముదురు’లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో పలు హిట్ సినిమాల్లో నటించి, దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకుంది.